ది పార్క్, చెన్నై
భారతదేశంలోని చెన్నై నగరంలో పార్క్ చెన్నై ఫైవ్ స్టార్ డీలక్స్ హోటల్ ఉంది. అన్నా ఫ్లై ఓవర్ దగ్గరలో పాత జెమినీ స్టూడియోప్రాంగణంలోని అన్నాసాలై ప్రాంతంలో ఈ హోటల్ ఉంది. చెన్నై నగరానికి గుండె కాయలాంటి అన్నాసాలై దగ్గరలో హోటల్ ఉండటం విశేషం. విదేశీయులు, వ్యాపారం కోసం, సెలవుల్లో గడపడానికి వచ్చే వారికి ఈ హోటల్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఏపీజే సురేంద్ర గ్రూపులో ఇది ఒక భాగంగా ఉంది. ఈ హోటల్ ను మే-15, 2002లో దాదాపు రూ. 1,000 మిలయన్ల పెట్టుబడితో స్థాపించారు. చెన్నై నౌకాశ్రయం నుంచి కేవలం 5 నిమిషాలు ప్రయాణిస్తే చెన్నై పార్క్ హోటల్ కు చేరుకోవచ్చు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ హోటల్ కేవలం 10 మైళ్ల దూరంలో ఉంటుంది.
Read article